యువకుడు అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు
KMM: తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు అదృశ్యమయ్యాడు. అంజనాపురం గ్రామానికి చెందిన కనికరపు వెంకట నరేష్ (29) అనే వ్యక్తి ఇంటి నుంచి బైక్‌పై వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో అతని భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటకృష్ణ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.