VIDEO: 'ఎయిడ్స్‌ను అంతం చేద్దాం'

VIDEO: 'ఎయిడ్స్‌ను అంతం చేద్దాం'

ASR: ఎయిడ్స్ వ్యాధికి మందు లేదని, నివారణ ఒక్కటే మార్గమని కొయ్యూరు మండలం డౌనూరు పీహెచ్‌సీ వైద్యాధికారులు డాక్టర్ వినయ్ కుమార్, డాక్టర్ రవీంద్ర పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా సోమవారం వైద్య సిబ్బందితో కలిసి డౌనూరులో ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ఎయిడ్స్‌ను అంతం చేద్దాం, హెచ్ఐవీ పరీక్ష, భవిష్యత్తుకు సురక్ష అంటూ ర్యాలీలో నినాదాలు చేశారు.