'సంబంధిత అధికారే ఎండార్స్‌మెంట్ ఇవ్వాలి'
VZM: అర్జీదారు సమస్యను పూర్తిగా అర్ధం చేసుకోవాలని, వారు చెప్పే విషయాన్ని ఓపిగ్గా వినాలని అప్పుడే వారికి సంతృప్తి కలుగుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ వినతులపై కలెక్టర్ సమీక్షించారు. వినతులపై స్వయంగా సంబంధిత అధికారులే ఎండార్స్‌మెంట్ చేయాలని, కిందిస్థాయి అధికారులకు ఇవ్వకూడదని సూచించారు.