రేపు తమిళనాడులో పవన్ ఎన్నికల ప్రచారం

రేపు తమిళనాడులో పవన్ ఎన్నికల ప్రచారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సిద్ధమవుతున్నారు. ఈ ఎన్నికల్లో NDA కూటమి విజయమే లక్ష్యంగా ప్రచారం చేయనున్నారు. ఈ మేరకు రేపు నాగర్‌కోయిల్ పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభలో బీజేపీ అభ్యర్థి ఎం.ఆర్ గాంధీని గెలిపించాలని తమిళ ప్రజలను కోరనున్నారు. కాగా ఈ నెల 23న పోలింగ్, మే 04న ఫలితాలు వెలువడనున్నాయి.