రోడ్డు నిర్మాణం, భూ ఆక్రమణలపై కలెక్టర్‌కు వినతి

SKLM: ఆమదాలవలస నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి సువ్వారి గాంధీ సోమవారం శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్‌కు గ్రీవెన్స్‌లో వినతిపత్రం అందించారు. పొందూరు జగనన్న కాలనీకి రోడ్డు నిర్మించాలని, ఆమదాలవలస లక్ష్ముడు పేట నుంచి కృష్ణాపురంకు రోడ్డు నిర్మించాలని కోరారు. పొందూరు మండలం బాణాం పంచాయతీలో నేదురు జయమ్మ భూమి ఆక్రమణకు గురైందని తెలిపారు.