'నిందితులను తక్షణమే శిక్షించాలి'

అల్లూరి: AISF జిల్లా కార్యాలయం పాడేరులో కన్వీనర్ కె రాజశేఖర్ ఆధ్వర్యంలో AISF రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడు గగన్ దీప్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గగన్ దీప్ సింగ్‌ను హత్య చేసిన నిందితులను తక్షణమే అదుపులోకి తీసుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హత్య జరిగి నేటికి 20 రోజులు దాటుతున్నా విచారణ లేదన్నారు.