ప్రమాదకరంగా మ్యాన్ హోల్.. పట్టించుకోరే..?

మేడ్చల్: కూకట్ పల్లి ప్రశాంతి నగర్ A1 చికెన్ సెంటర్ వద్ద మ్యాన్ హోల్ తెరిచి ప్రమాదకరంగా ఉన్నట్లు అక్కడి ప్రజలు తెలిపారు. కొన్ని రోజులు గడుస్తున్నప్పటికీ మరమ్మత్తులు పూర్తి చేయడం లేదని పేర్కొన్నారు. అసలే వర్షాకాలం వేళ, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, సాధ్యమైనంత త్వరగా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు.