VIDEO: పుట్టాలమ్మ క్షేత్రంలో ప్రత్యేక పూజలు
NDL: ఆర్.కృష్ణాపురం సమీపంలోని శ్రీ రామతీర్థం పుట్టాలమ్మ క్షేత్రంలో ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వేకువజామునే పూజలు చేసి నువ్వుల పిండి, చల్ల పిండి నైవేద్యంగా సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, పరశురామేశ్వర స్వామి పార్వతీదేవి, నరసింహ స్వామి, లక్ష్మీదేవిని దర్శించుకున్నారు.