సత్తెనపల్లి యువకుడు గల్లంతు.. మృతదేహం లభ్యం
PLD: సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు వద్ద అమరావతి మేజర్ కెనాల్‌లో ఈతకు వెళ్లిన నలుగురు యువకులలో ఒకరైన సత్తెనపల్లి పట్టణానికి చెందిన గిరీష్(19) తీవ్ర నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతి చెందాడు. మంగళవారం అతని మృతదేహం కనుగొనబడింది. ఈ ఘటనతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.