ఇలా చేస్తే మీ మొబైల్ రిస్క్‌లో ఉన్నట్లే!

వేసవిలో మొబైల్స్ పేలే ఘటనలు తరుచూ వింటుంటాం. అతి వేడి కారణంగా ఫోన్స్ పేలిపోతాయి. నాణ్యత లేని ఛార్జింగ్ కేబుల్స్ వాడటం వల్ల బ్యాటరీ ఓవర్ లోడ్ అయ్యి ఇలా జరుగుతుంది. నిరంతరాయంగా ఛార్జింగ్ పెట్టడం, ఛార్జింగ్ ఫుల్ అయినా ప్లగ్ నుంచి కేబుల్ తీయకపోవడం వల్ల కూడా ఫోన్ పేలుతుంది. ఒక ఫోన్ ఛార్జర్‌ను వేరొక మొబైల్‌కు వాడటం కూడా మంచిది కాదు.