కామారెడ్డిలో 21వ శ్రీ చండీ జయంతి ఉత్సవాలు

KMR: కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అశోక్ నగర్ కాలనీ శ్రీ విద్యా భారతిపురంలోని శ్రీ చండీ మంత్రాలయంలో 21వ శ్రీ చండీ జయంతి ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగనున్నట్లు శ్రీ నిత్య ముక్త హ్రియానంద స్వామీజీ తెలిపారు. ఉత్సవాలలో సుప్రభాత సేవ, హారతి, పూజా సంకల్పము, శ్రీ చక్రార్చనలు, కుంకుమార్చనలు, మహా నైవేద్యం, హారతి నిర్వహించారు.