ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం

ఖానాపూర్ మున్సిపాలిటీ బీజేపీ కైవసం

TG: ఖానాపూర్ మున్సిపాలిటీని బీజేపీ కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక ఎన్నికయ్యారు. బీజేపీ-బీఆర్ఎస్ కౌన్సిలర్లు కూటమిగా ఏర్పడ్డారు. వైస్ ఛైర్మన్ బరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మహ్మద్ షోయబ్ ఉన్నారు. కాగా, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, వైస్ ఛైర్మన్ అభ్యర్థి ఎన్నికలో గందరగోళం నెలకొన్నట్లు సమాచారం.