ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్

SRCL: ప్రజావాణి దరఖాస్తులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో ప్రజల నుంచి కలెక్టర్ సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణికి వచ్చే దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని కలెక్టర్ ఆదేశించారు.