ఆ వార్తలను ఖండిస్తున్నాం: అల్ ఫలాహ్ వర్సిటీ
ఢిల్లీ పేలుడు ఘటనలో తమ వర్సిటీ పేరు రావడంపై ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీ స్పందించింది. 'పేలుడు ఘటన విషయంలో మా వర్సిటీపై కావాలనే తప్పుడు కథనాలు వ్యాప్తి చేయడాన్ని మేం ఖండిస్తున్నాం. అధికారులు అరెస్ట్ చేసిన వారితో వర్సిటీకి వృత్తిపరంగా తప్పా.. వారి చర్యతో వర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు' అని స్పష్టం చేసింది.