విజయవాడలో రోడ్లపై అక్రమణల తొలగింపు
NTR: విజయవాడలో ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ ఏ. ఉమమహేశ్వరరావు, RSI శ్రీధర్ ఆధ్వర్యంలో సిబ్బంది శివాలయం వీధిలో రోడ్లపై ఉన్న అక్రమణలను తొలగించారు. పాదచారులు, వాహనదారులకు అంతరాయం కలిగిస్తున్న షాపుల ముందు రోడ్డుపై పెట్టిన వస్తువులను పోలీసులు తొలగించారు. దుకాణదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి, పునరావృతం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.