సైక్లింగ్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యం

KMM: సైక్లింగ్ ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆరోగ్యవంతమైన జీవనం సొంతమవుతుందని జిల్లా అటవీ అధికారి(DFO) సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఖమ్మం సైక్లింగ్ క్లబ్ లోగోను శుక్రవారం ఆయన తన కార్యాలయంలో ఆవిష్కరించడంతో పాటు మొక్క నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సైక్లింగ్ ద్వారా కాలుష్యాన్ని నియంత్రించవచ్చనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.