హిస్టరీ లెక్చరర్ గుండెపోటుతో మృతి

హిస్టరీ లెక్చరర్ గుండెపోటుతో మృతి

ELR: నూజివీడు శ్రీ మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిస్టరీ లెక్చరర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పులివర్తి మురళీధర్ (55) గుండెపోటుతో శనివారం మృతి చెందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పాతూరి తేజేంద్ర తెలిపారు. మురళీధర్ ఇటీవల బంటుమిల్లి కళాశాల నుంచి నూజివీడుకు బదిలీపై వచ్చినట్లు చెప్పారు. మురళీధర్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు.