ఎమ్మెల్యేను కలిసిన ఆర్టీసీ డిపో మేనేజర్
KDP: మైదుకూరు ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన శ్రీలత మంగళవారం ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్‌ను ప్రొద్దుటూరులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా డిపో, సిబ్బంది సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. మైదుకూరు ఆర్టీసీ డిపో అభివృద్ధికి, సిబ్బంది సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు తెలిపారు.