ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

పల్నాడు: రొంపిచర్ల మండలం బుచ్చి పాపన్నపాలెం గ్రామంలో జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె గ్రామంలో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.