ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, టిప్పర్ ఢీ కొని మహిళతో సహా ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయినట్లు సమాచారం. మృతులు మోహత్‌పూరకు చెందిన తరంజిత్, మయాంక్, కిరణ్ దేవిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.