VIDEO: పల్లెర్లలో డ్రైనేజీ సమస్య
NRPT: మద్దూర్ మండలం పల్లెర్లలో మురుగు కాలువల లేమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తూ.. దుర్వాసన వ్యాపిస్తోంది. నీరు నిల్వతో దోమలు పెరిగి వ్యాధులు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వెంటనే డ్రైనేజీలు శుభ్రం చేసి కొత్త కాలువలు నిర్మించాలని అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.