సచివాలయం వద్ద మహిళా ఉద్యోగిని కాపాడిన SPF
TG: రాష్ట్ర సచివాలయం (సెక్రటేరియట్) ప్రధాన ద్వారం వద్ద ప్రమాదం జరిగింది. సచివాలయం ముందు ఉన్న అండర్ వెహికల్ స్కానర్ గ్రిల్‌లో ఓ మహిళా ఉద్యోగి కాలు ఇరుక్కుపోయింది. వెంటనే స్పందించిన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(SPF) సిబ్బంది.. గ్రిల్‌ను కట్ చేసి ఆ ఉద్యోగిని కాలును బయటికి తీశారు. అనంతరం ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.