భాకరాపేటలో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు రట్టు

భాకరాపేటలో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టు రట్టు

తిరుపతి జిల్లా అటవీశాఖాధికారి వీ.సాయిబాబా ఆదేశాల మేరకు భాకరాపేట రేంజ్‌లో ఎర్రచందనం అక్రమ రవాణాపై అటవీశాఖ దాడులు నిర్వహించింది. పింఛ అటవీ ప్రాంతం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న టొయోటా ఫార్చునర్ కారును భాకరాపేట–తలకోన రోడ్డులో అడ్డుకున్నారు. కారులోని 546 కిలోల బరువున్న 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకొని, రూ.35 లక్షల విలువగా అంచనా వేశారు.