చెరువులో పడి వ్యక్తి మృతి
NZB: డిచ్‌పల్లి మండలం దూస్ గాన్ చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. ఇందల్వాయి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ విక్రమ్ వివరాల ప్రకారం.. నిజామాబాద్‌కు చెందిన జగన్నాథం శనివారం దూస్ గాన్ గ్రామానికి పని నిమిత్తం వచ్చాడు. ఊరు చివరన గల కొత్త చెరువులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ పడిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది గాలింపు చేపట్టి మృత దేహాన్ని వెలికి తీశారు.