ఆరు కేజీల గంజాయి స్వాధీనం

ఆరు కేజీల గంజాయి స్వాధీనం

HYD: సికింద్రాబాద్ సెంట్రల్ రైల్వే డివిజన్, రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ అధికారులు గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేశారు. అతని దగ్గర 6. 242 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ రూ. లక్ష 56 వేలు అని అధికారులు చెప్పారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను నివారించడానికి, రైల్వే ప్రయాణికులను రక్షించడానికి రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ ఉందన్నారు.