రక్తదానం చేస్తూ తోటి కుక్కల ప్రాణాలు కాపాడుతున్న పులి

రక్తదానం చేస్తూ తోటి కుక్కల ప్రాణాలు కాపాడుతున్న పులి

KMM: పశు వైద్యశాలలో ఓ శునకం అనేకసార్లు రక్తదానం చేసి తోటి కుక్కల ప్రాణాలు కాపాడింది. ఏడాది క్రితం అనారోగ్యంతో ఉన్న ఈ శునకాన్ని ఆసుపత్రి ప్రాంగణంలో విడిచి వెళ్లిపోయారు. అప్పటినుంచి దీని పోషణ బాధ్యతలు వైద్య సిబ్బంది చూసుకుంటున్నారు. ముద్దుగా దీనికి పులి అని పేరు పెట్టినట్లు పశు వైద్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ఇవాళ ఓ ప్రకటనలు తెలిపారు.