చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం

MBNR: బీజేపీ కార్యకర్తలు ముందుకు వచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పాలమూరు పార్లమెంటు సభ్యురాలు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ కొనియాడారు. పాలమూరు పట్టణం 21వ వార్డు కాలనీలో తిరుగుతూ, సమస్యలు తెలుసుకున్నారు. ఎంపీ మాట్లాడుతూ.. కార్యకర్తలకు ప్రజలకు అండగా ఉంటామన్నారు. ఇతర కార్యకర్తలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.