ఎర్రగుంట్లలో ఆటో డ్రైవర్ మిస్సింగ్

ఎర్రగుంట్లలో ఆటో డ్రైవర్ మిస్సింగ్

KDP: ఎర్రగుంట్లో ఓ వ్యక్తి మిస్ అయ్యాడు. ప్రకాశ్ నగర్‌కు చెందిన వలసగాల్ల నాగరాజు (40) ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 18న ఆటోతో ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆయన గురించి ఎవరికైనా సమాచారం తెలిస్తే స్టేషన్‌కు వచ్చి తెలియజేయాలని సీఐ విశ్వనాథ రెడ్డి కోరారు.