'ఐటీ ముసుగులో ప్రజల ఆస్తుల దోపిడీ'

'ఐటీ ముసుగులో ప్రజల ఆస్తుల దోపిడీ'

VSP: కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు మేలు జరగలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. విశాఖలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐటీ కంపెనీల పేరిట ప్రజల భూములను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. రుషికొండలో సత్త్వ కంపెనీకి మార్కెట్ విలువ రూ.1500 కోట్లు ఉన్న 30 ఎకరాల భూమిని కేవలం రూ.45 కోట్లకే కేటాయించిందన్నారు.