మరో ISI ఏజెంట్ అరెస్ట్

మరో ISI ఏజెంట్ అరెస్ట్

పాక్ ISI కోసం పని చేస్తున్న రాజస్థాన్‌కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. స్టేట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీస్‌లో పని చేసే సకూర్ ఖాన్ మగళియార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడు గత రాష్ట్ర ప్రభుత్వంలో ఓ మంత్రికి వ్యక్తిగత సహాయకుడిగా పని చేయడం సంచలనంగా మారింది. అంతేకాకుండా అతడికి పాక్ దౌత్య కార్యాలయంతో సంబంధాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.