జహీరాబాద్‌లో నోటాకు 2,933 ఓట్లు

జహీరాబాద్‌లో నోటాకు 2,933  ఓట్లు

KMR: లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్రులు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. జహీరాబాద్ లోక్‌సభ పరిధిలో 19మంది పోటీచేశారు. ఇందులో 10 మంది స్వతంత్రులే. వీరిలో ఎవరికీ 6వేల ఓట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఏడు నియోజకవర్గాల్లో 12,25,049 ఓట్లు పోలయ్యాయి. ఇందులో స్వతంత్రులకు 31,079 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో నోటాకు 2,933 ఓట్లు వచ్చాయి.