VIDEO: ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మండి: ఏవో
GNTR: రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని కొల్లిపర ఏవో శ్రీనివాసరెడ్డి శుక్రవారం తెలియజేశారు. ఇప్పటివరకు 920 మంది రైతుల నుంచి 4 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. క్వింటాలుకు రూ. 2,389 చొప్పున ధర చెల్లిస్తున్నందున, రైతులు బయట మార్కెట్‌లో తక్కువ ధరకు అమ్ముకోవద్దని ఆయన ప్రత్యేకంగా సూచించారు.