ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ఏసీబీ వలలో పంచాయతీ కార్యదర్శి

ASR: బొండపల్లి పంచాయతీ కార్యదర్శి లక్ష్మణరావు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. పంచాయతీ శానిటేషన్ బిల్లును మార్పు చేయడానికి రూ.30 వేలు లంచం కోరినట్లు సమాచారం. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో అధికారులు వలపన్నారు. ఇవాళ లక్ష్మణరావు నివాసం వద్ద బాధితుడు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.