VIDEO: బుడుమూరులో అగ్నిప్రమాదం మూడు పూరిళ్లు దగ్ధం
SKLM: లావేరు మండలం బుడుమూరులో శుక్రవారం అగ్ని ప్రమాదం సంభవించింది. గ్రామంలోని మూడు పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఇంట్లో గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు తెలిపారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.