ఇరాన్‌కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ భూభాగంలోని అన్ని ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అక్కడి నిరంకుశ పాలన నుంచి ఇరాన్ ప్రజలకు విముక్తి కలిగించి, వారికి స్వేచ్ఛను ప్రసాదిస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. ఈ సంచలన వ్యాఖ్యలతో పశ్చిమ ఆసియాలో యుద్ధ మేఘాలు మరింతగా కమ్ముకున్నాయి.