జిల్లాలో సర్పంచ్‌లకు 929 నామినేషన్లు
RR: తొలి విడత పంచాయతీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ నిన్న సాయంత్రంతో ముగిసింది. ఈరోజు నుంచి రెండో విడత మొదలుకానుంది. తొలి విడత ఎన్నికల్లో భాగంగా రెండు డివిజన్లు, ఏడు మండలాల పరిధిలోని 174 సర్పంచ్ స్థానాలు, 1,530 వార్డులకు నామినేషన్లను ఆహ్వానించగా.. సర్పంచ్‌కు 929 నామినేషన్లు, వార్డులకు 3,327 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.