ఘనంగా గ్రంథాలయ వారోత్సవాలు
WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్‌లో బుధవారం గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కెవి చలపతిరావు, పి.వాసుదేవరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగినా పుస్తకాలకు ప్రత్యామ్నాయం లేదని, విద్యార్థులు గ్రంథాలయాలను సందర్శించి జ్ఞానాన్ని పొందాలని సూచించారు.