ఇళ్ల మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే
JGL: సారంగాపూర్ మండల కేంద్రంలో 89 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఇవాళ అందజేశారు. మండలానికి మొత్తం 571 ఇళ్లు మంజూరయ్యాయని, లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.62 కోట్లు జమ అయ్యాయని ఆయన తెలిపారు. 299 మంది ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని, 152 ఇండ్ల పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.