16, 23న మహా ధర్నా... వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

16, 23న మహా ధర్నా... వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

KMM: నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై ఈనెల 16న జిల్లా కేంద్రాలలో, 23న సెంట్రల్ లేబర్ ఆఫీస్ హైదరాబాద్‌లో జరిగే మహా ధర్నాలను జయప్రదం చేయాలని IFTU జిల్లా అధ్యక్షులు షేక్ సుభహన్ పిలుపునిచ్చారు. ఈమేరకు గురువారం ఖమ్మం బల్లేపల్లిలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉన్నత వర్గాల కొమ్ముకాస్తూ అదానీ, అంబానీకి దేశ సంపద అప్పచెబుతుంద‌న్నారు.