సీఎం చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

కృష్ణా: కోట్లాది తెలుగు ప్రజల నమ్మకం సీఎం చంద్రబాబు అని ఎమ్మెల్యే రాము కొనియాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తి కావడంతో ఎమ్మెల్యే రాము హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన సోమవారం శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు సీఎం అవ్వడం వల్ల లబ్ధి పొందిన కోట్లాదిమందిలో తాను కూడా ఒకడినని అన్నారు.