'యూరియా అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు'

SRCL: జిల్లాలో యూరియా కేంద్రాల వద్ద యూరియా పంపిణీ సమయాల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్ తెలిపారు. యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని పేర్కొన్నారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్‌ల వద్ద 24 గంటల పాటు నిరంతరం తనిఖీలు చేపడతామన్నారు.