నామినేషన్ల స్వీకరణకు ఐదు క్లస్టర్లు ఏర్పాటు
NLG: మఠంపల్లి మండలంలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల కోసం 5 క్లస్టర్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో జగదీష్ తెలిపారు. మండలంలో 29 గ్రామ పంచాయతీల సర్పంచ్, 254 వార్డుల నామినేషన్లు ఆయా క్లస్టర్లలో స్వీకరించనున్నారు. అభ్యర్థులు కొత్త బ్యాంక్ అకౌంట్, కుల ధృవీకరణ, 4 ఫోటోలు, ఓటరు ఐడీ, నో డ్యూస్ సర్టిఫికేట్ సమర్పించాలని అధికారులు సూచించారు.