VIDEO: దేవనకొండలో కప్పేసిన పొగ మంచు

VIDEO: దేవనకొండలో కప్పేసిన పొగ మంచు

KRNL: దేవనకొండ మండలంలో సోమవారం ఉదయం దట్టమైన పొగ మంచు కమ్మేసింది. ఉదయం 7:20 సమయంలో కూడా మంచు వీడకపోవడంతో చలి తీవ్రత పెరిగింది. పొలాలు, చెట్లపై మంచు పేరుకుపోవడంతో వాతావరణం మరింత చల్లగా మారింది. దట్టమైన మంచు కారణంగా వాహనదారులు ముందున్న వాహనాలు సరిగా కనిపించక ఇబ్బందులు పడ్డారు.