తిరుమల పర్యటనకు రాష్ట్రపతి.. ఈవో సమీక్ష
AP: ఈ నెల 21న రాష్ట్రపతి ముర్ము తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ముందుగా ఈనెల 20న తిరుచానూరులో పద్మావతి అమ్మవారిని దర్శించుకుని అనంతరం తిరుమలకు చేరుకుంటారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లపై టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ పర్యటనకు సంబంధించి సమగ్ర ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.