కుట్టుమిషన్లను అందించిన ఎమ్మెల్యే

RR: షాద్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇందిరమ్మ మైనార్టీ మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా కుట్టుమిషన్లను ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శనివారం పంపిణీ చేశారు. తెలంగాణ క్రిస్టియన్ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు.