కొత్తవలసలో 'హర్ ఘర్ తిరంగా' ర్యాలీ కార్యక్రమం

VZM: దేశ సమగ్రతకు త్రివర్ణ పతాకం స్ఫూర్తిగా నిలుస్తుందని కొత్తవలస ప్రత్యేక అధికారిణి ఎం.అన్నపూర్ణమ్మ అన్నారు. 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమంలో బాగంగా బుధవారం కూడలి నుంచి MPDO కార్యాలయం వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. వెలుగు సిబ్బంది కూడలి మానవహారం చేసారు. ఎంతోమంది స్వాతంత్రం సాధించటానికి ప్రాణాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామస్వామి తదితరులు పాల్గొన్నారు.