వసతి గృహాన్ని తనిఖీ చేసిన అధికారులు
SRPT: ప్రజా పాలన ప్రగతిలో భాగంగా తుంగతుర్తి మహిళా రెసిడెన్షియల్ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈరోజు డీఎం సివిల్ సప్లై అధికారి శ్రీధర్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతులను పరిశీలించి, విద్యార్థులకు నిబంధనల ప్రకారం రుచికరమైన, నాణ్యమైన భోజనాన్ని అందించాలని సిబ్బందిని ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.