ప్రణాళికతో చదివితే మంచి ఫలితాలు: DIEO
SDPT: విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% పాస్ అవడంతో సరిపెట్టుకోకుండా ఉత్తమ మార్కులు సాధించి ఐఐటీ, మెడిసిన్ వంటి పరీక్షలలో సీట్లు సంపాదించాలని సిద్దిపేట DIEO రవీందర్ రెడ్డి అన్నారు. గురువారం నంగునూరులోని మెడల్ స్కూల్, జూనియర్ కళాశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ జానయ్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ప్రణాళికతో చదివితే ఫలితాలు వస్తాయన్నారు.