VIDEO: ఎమ్మెల్యేకు BRS కండువా కప్పబోయిన కార్యకర్త
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరినా, తాను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెప్పుకుంటుండటం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు పార్టీ కండువా కప్పుతానంటూ స్పందించిన బీఆర్ఎస్ కార్యకర్త నారపాక రవీందర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన జిల్లాలో రాజకీయ చర్చలకు దారితీసింది.