జిల్లాలో ఏప్రిల్ 2న హనుమాన్ విజయ యాత్ర బైక్ ర్యాలీ
WGL: జిల్లాలో ఏప్రిల్ 2న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ‘వీర హనుమాన్ విజయ యాత్ర’ బైక్ ర్యాలీ నిర్వహించనున్నామని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హయగ్రీవ చారి గ్రౌండ్‌లో మహా హారతితో ముగిసే ఈ ర్యాలీలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయని పేర్కొన్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.